దివ్య సాకేతంలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై పాలేక‌ర్ శిక్ష‌ణ..!

ఈ దేశం గ‌ర్వించ‌ద‌గిన వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌ల‌లో సుభాష్ పాలేక‌ర్ ఒక‌రు. ఎలాంటి పెట్టుబడులు లేకుండా ..ర‌సాయ‌నాలు, మందులు వినియోగించ‌కుండా వ్య‌వ‌సాయం ఎలా సాగు చేయ‌వ‌చ్చో ..ఆత్మ‌హ‌త్య‌ల నుండి కాపాడు కోవ‌చ్చో పాలేక‌ర్ గ‌త కొన్నేళ్లుగా దేశ‌మంత‌టా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయం సాగుపై రైతుల‌కు స‌మావేశాలు, అవ‌గాహ‌న స‌ద‌స్సులు చేపడుతూ రైతుల్లో ఆత్మ‌విశ్వాసాన్ని నింపుతున్నారు. ప్ర‌త్యేకంగా ఎలా