Experience the Divine

Experience the Divine

‘Andamina Anubhavalu’

#6 Acharya is ALWAYS with us!
Beautiful experiences shared by Smt. Padma Rallapalli garu, a lecturer in college from Vishakhapatnam.

Jai Srimannarayana!
My grand mother Sridevamma garu inculcated in me the devotion to lord since I was a child. When in my teens, grand mother taken me to a Guru’s ashram. His ashram is near Vijayawada, where she had shown me a young swamiji who was none other than His Holiness Sri Chinna Jeeyar Swamiji. He had taken sanya:sa:sramam at that time and I felt He is not an ordinary human being. I felt His eyes were filled with celestial light. In my 40’s I had taken pancha samskaram. since then I developed telepathy with Swamiji. Do you knwo what Telepathy is? Telepathy means communication between two minds. If I get any doubts, I get clarifications for my doubts.

Few years back I was performing Saranagathi Diksha. At the time of closing ceremony, we went to Sitanagaram accompanied by my husband and my son Sidharth. At that time I heard devotees talking, if Guru or Acharya looks into the eyes of a person, His blessings will be sent through his eyes. I prayed SWamiji for my son. After the completion of the function, we were coming back. Then my son said, “Amma, He looked into my eyes twice. I don’t know the reason.” I was shocked to hear this. That means Swamiji answered my prayer. Later, my son settled well in his life. Now, he is in Dallas.

As far as my daughter Hema Sri is concerned, that time she was in Pheonix and I was thinking about my daughter, “Swamiji please bless my daughter.” Immediately, I got a call mmy from my daughter. She said, “amma, I came to know that Swamiji is here in Pheonix. Some devotees rang me up and asked if I can help them as volunteer.” I couldn’t believe my ears. That means Swamiji answered my prayers. She served there, met Swamiji and took His blessings.

As far as spiritual aspects are concerned, I always get clarifications from Swamiji’s preachings almost immediately. Once I got a doubt if dreams were true and Swamiji said, “Dreams are as real as the life situations we experience every day.”
Another time I got a doubt that if God is formless or with form. Then Swamiji said, God is formless because He is all pervasive. We can’t see Him with form. But, if we want to see Him in form, we can see Him in form also.

When I was working in schools and colleges, whenever I feel I had a feeling that I was over burdened with work, Swamiji was always there beside me invisibly and used to console me. Normally I find “Jai Srimannarayana” sign on the vehicles. I feel that SWamiji is consoling me, swamiji is talking to me and I feel relieved from my agony.

Bottom-line is, We need not feel that Acharya is not there with us in any given moment. He is always there with us. We can feel the presence of Acharya even in His photographs. We can feel that He is talking to us. What we have to do is, follow His footprints.

There are many more experiences, will share them in future.

Jai Srimannarayana!

#6 ప్రతి క్షణం ఆచార్య సమక్షం

శ్రీమతి పద్మ రాళ్లపల్లి గారు, ఇంగ్లీష్ లెక్చరర్, విశాఖపట్నం నుండి. ఇది తెలుగు అనువాదం.

నా చిన్న తనంలో, మా అమ్మమ్మ నన్ను విజయవాడకు సమీపంలో ఉన్న ఒక గురువుల ఆశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ ఆవిడ నాకు ఒక యువ స్వామీజీని చూపించారు, వారు ఎవరో కాదు, పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు. వారు అప్పుడప్పుడే సన్యాసం స్వీకరించినట్టున్నారు. చూడగానే వీరు సాధారణమైన వారు కారని అనిపించింది. వారి నేత్రాలు దివ్య కాంతిని వెదజల్లుతున్నాయి.

నేను, నా 40వ ఏటలో పంచ సంస్కారం తీసుకున్నాను. అప్పటి నుండి, నాకు ఏ సందేహాలున్నా స్వామివారితో మానసికంగానే కనెక్ట్ అయి, సందేహాలు నివృత్తి చేసుకుంటాను.

కొన్ని సంవత్సరాల క్రితం నేను శరణాగతి దీక్ష చేస్తున్నాను. ముగింపు ఉత్సవం సమయంలో, నేను, నా భర్త మరియు నా కుమారుడు సిద్ధార్థ్‌తో కలిసి సీతానగరం వెళ్ళాము. ఆ సమయంలో భక్తులు మాట్లాడుకోవడం విన్నాను, గురువు లేదా ఆచార్యులు ఒక వ్యక్తి యొక్క కళ్లలోకి చూస్తే, వారి ఆశీర్వాదం అతని కళ్ళ ద్వారా గ్రహించబడుతుంది అని. నేను మా అబ్బాయి కోసం స్వామి వారిని ప్రార్థించాను. ఫంక్షన్ పూర్తయ్యాక తిరిగి వస్తున్నాం. అప్పుడు మా అబ్బాయి “అమ్మా.. స్వామి వారు నా కళ్లలోకి రెండు సార్లు అలా చూశారు. ఎందుకో తెలియదు” అన్నాడు. ఇది విని నేను షాక్ అయ్యాను. అంటే స్వామి వారు నా ప్రార్థనకు జవాబిచ్చారన్న మాట. తరువాత, మా అబ్బాయి తన జీవితంలో బాగా స్థిరపడ్డాడు. ఇప్పుడు డల్లాస్‌లో ఉంటున్నాడు.

మా కూతురు హేమశ్రీ విషయానికొస్తే, ఆ సమయంలో ఆమె ఫీనిక్స్‌లో ఉండేది. నేను ఒక రోజు తన గురించి ఆలోచిస్తూ, “స్వామీజీ దయచేసి నా కుమార్తెను ఆశీర్వదించండి.” అని ప్రార్థించాను. వెంటనే, మా కూతురి నుండి కాల్ వచ్చింది. ఆమె, “అమ్మా, స్వామీజీ ఇక్కడ ఫీనిక్స్‌లో ఉన్నారని తెలిసింది. కొంతమంది భక్తులు నాకు ఫోన్ చేసి, నేను వాలంటీర్‌గా సహాయం చేయగలవా అని అడిగారు.” నా చెవులను నేను నమ్మలేకపోయాను. అంటే స్వామి వారు నా ప్రార్థనలకు జవాబిచ్చారు. అలా అక్కడ సేవ చేసి, స్వామి వారిని కలుసుకుని ఆశీస్సులు అందుకుంది.

ఆధ్యాత్మిక అంశాల విషయానికొస్తే, స్వామి వారి ప్రవచనాల నుండి నాకు ఎల్లప్పుడూ స్పష్టత లభిస్తుంది. ఒకసారి నాకు, కలలు నిజమా కాదా అనే సందేహం వచ్చింది. వెంటనే, ఒక ప్రవచనంలో స్వామి వారు ఇలా చెప్పారు. “కలలు కూడా నిజమే. ఎక్కడో, ఎప్పుడో మనం చూసినవి, ఆలోచించినవి, కలల రూపంలో వస్తాయి” అని.

మరొకసారి, దేవుడు నిరాకారుడా లేక రూపంతో ఉంటాడా అనే సందేహం వచ్చింది. అప్పుడు స్వామి వారు మాట్లాడుతూ, భగవంతుడు నిరాకారుడు, ఎందుకంటే ఆయన సర్వవ్యాపి. ఆ విధంగా మనం ఆయనను రూపంతో చూడలేము. కానీ, మనం ఆయనను రూపంతో చూడాలనుకుంటే, రూపంలోనూ సాక్షాత్కరిస్తాడు విభవ, అర్చావతారాల్లో.

నేను స్కూల్స్‌లో, కాలేజీల్లో పని చేస్తున్నప్పుడు, నాకు పని భారం ఎక్కువ అని అనిపించినప్పుడల్లా, స్వామి వారు నా పక్కనే ఉండి నన్ను ఓదార్చినట్టు అనిపించేది మానసికంగా. అలాంటి సమయాల్లో వాహనాలపై “జై శ్రీమన్నారాయణ” అనే గుర్తొ, అలా ఎదో ఒక గుర్తు కనిపిస్తుంది. అలా స్వామి వారు నన్ను ఓదారుస్తున్నారని, స్వామి వారు నాతో మాట్లాడుతున్నారనే భావన కలిగి, నా వేదన నుంచి ఉపశమనం లభించేది.

ఆచార్యులు మనతో లేరని మనం ఎప్పుడు భావించనవసరం లేదు. వారు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. వారిని మన మనసులో భావించినప్పుడు, వారి చిత్రాలను చూసినప్పుడు ఆచార్యుల ఉనికిని మనం స్పష్టంగా అనుభవించవచ్చు. వారు మన ప్రతి సందేహాన్ని తీరుస్తారనడంలో సందేహం లేదు. మనం చేయాల్సింది ఏమిటంటే, వారు చూపిన మార్గాన్ని అనుసరించడం.

ఇంకా ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి, వాటిని భవిష్యత్తులో మీతో పంచుకుంటాను.

జై శ్రీమన్నారాయణ!

  • Experience the Divine Experience the Divine 'Andamina Anubhavalu’ #6 Acharya is ALWAYS with us! Beautiful experiences shared by

    Share This Story,
  • Experience the Divine Experience the Divine #2 Heart of Gold! Jai Srimannarayana! Under the guidance of His Holiness Sri

    Share This Story,
  • Experience the Divine Secret of Acharya Jai Srimannarayana! Have you experienced an epiphany, an 'aha' moment, a sudden and

    Share This Story,