HH Chinna Jeeyar Swamiji inaugurated Manorama super specialty Hospital in Nizamabad at 11.00am on 26th April. The event was conducted in a grand way by the doctors. After the inauguration, on the request of hosts Smt. Dr. Ramadevi and Smn. Dr. Chandra Sekhar Rao, HH Swamiji has given a nice message to the gathering. HH also explained about Bhagavad Ramanuja and his glories in connection with 1000th year Tirunakshatram celebrations.
సంఘ సంస్కర్తగా.. దీనుల బాంధవుడిగా రామానుజాచార్యులు వినుతికెక్కారని, ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచు కోవడం వల్ల ఎన్నో సమస్యల నుండి గట్టెక్కగలిగే అవకాశం కలుగుతుందని సెలవిచ్చారు. నిజామాబాద్ పట్టణంలో 26న ఉదయం 11 గంటలకు స్వామీజీ డాక్టర్ రమాదేవి, డాక్టర్ చంద్రశేఖర్‌రావుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనోరమ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. భక్తులు భారీ ఎత్తున హాజరయ్యారు. వారందరికీ స్వామి వారు మంగళాశాసనాలు అందజేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. భగవత్ స్వరూపుడైన రామానుజుల వారి జీవిత విశేషాలను తెలియ చేశారు. శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో రామానుజులు జన్మించి వెయ్యి ఏళ్లు అయిన సందర్భంగా తిరునక్షత్రం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి భక్తుడు సద్వినియోగం చేసుకోవాలని స్వామీజీ కోరారు. మెరుగైన వైద్య సేవలు అందజేసి మంచి పేరు తెచ్చుకోవాలని నిర్వాహకులకు సూచించారు.