Here’s a special opportunity to put it into words.
Share your first memory, experience, or a moment of gratitude on the Wishes Wall, as we celebrate Swamiji’s 70th Acharya Thirunakshatram.
A memory. A few words. A heartfelt offering.
From Devotees Everywhere
జై శ్రీమన్నారాయణ !, ఓం అస్మద్ గురుభ్యో నమః !, స్వామి వారి శ్రీ చరణాలకు దాసోహములు సమర్పిస్తూ., స్వామి వారితో మాకు వున్న అనుభవాలు చెప్పాలంటే ఈ పేజీ సరిపోదు అని భావించాలేమో..మా జీవితం లో ఒక ఫామిలీ మెంబెర్ స్వామి వారు , మరి వారి గురించి చెప్పాలంటే ప్రతి క్షణము ప్రతి గంటా , ప్రతి రోజు గురించి చెప్పు కుంటూ పోవాలి... వారు మాకు త్వ మేవ మాతా చ , పితా త్వమేవ , త్వమేవ బందు చ్చ, గురు త్వమేవ , ద్రవిణం త్వమేవ , త్వమేవ సర్వం మామ దేవ దేవ ... ఇదే మాకు వారి తో వున్న సంబంధం అనుభవం కూడా.... శ్రీవారు చెప్పిన ఈటీవీ భవద్గితా ప్రవచనాలతో మాకు వారితో సంబంధం మొదలైయ్యింది. ఆ ప్రవచనాలు మా ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చి వేసాయి. అప్పటికి నాకు 16 సంవత్సరాలు, స్వామి వారిని చూసి ఒక 25 ఏళ్ళ వయస్సు వుంది అనుకునే వాణ్ని, వామ్మో ఇంత చ్చిన్న వయస్సులో వీరికి ఎంత జ్ఞానం వుంది అని ఆశ్చర్యం తో మరియు వారు చెప్పే వారు , గీతా సారాన్ని జీవితానికి కలిపి ఎలా నడవాలి ప్రతి విషయము లో అని, అప్పుడు అవును కదా మరి వారు అలా చెప్తుంటే మరి నేను ఇలా వున్నానేంటి అని నన్ను నేను మార్చు కుంటూ వచ్చాను... ఇంకా ఎంతో మారాల్సింది వుంది వారి మంగళా శాసనములతో తప్పకుండా వారు మెచ్చేట్టు, వారు మమ్మల్ని తయారు చేసుకుంటారు అని ప్రార్థిస్తూ.. CA చదవటానికి అదృష్టం వల్ల విజయవాడ లో వున్నాను, వారిని చాతుర్మాసం లో సీతానగరం లో 1999 లో చూసాను, అప్పుడు స్వామి వారిని చూసి ఆహా ఏంటా తేజం ఎంత అందం అని ఆశ్చర్యం , తీర్ధ గోష్టి అయ్యిన తరువాత, వారితో మాట్లాడాను ఒక అరటి పండు ఇచ్చారు, ఆ తరువాత వేద విద్యార్థులకు ఒక hut లో class తీసుకుంటున్నారు , అప్పుడు వారిని చూస్తుంటే గురుకులం లో వసిష్ఠుడు శిష్యులకు పాఠం చెప్తున్నట్టు మనసుకు ఏంతో చక్కని అనుభూతి ఆ అనుభూతి ని వారి అనుగ్రహం తో ఈ రోజు వరకు ఇక్కడ US లో వుండి కూడా అనుభవిస్తూనే వున్నాము, CA పూర్తి చేసుకుని వారి అనుగ్రహం తో, వారి ప్రవచనాలను వింటూ వారిని మనసులో సేవిస్తూ జీవితాన్ని గడుపుతూ వున్నాము, ఈ బంధాన్ని వారు మాకు ఎప్పటికీ ఇలానే ఉంచి తీరాలి... వారి ప్రతి మాటని ఆచరణలో పెడితే - బిజినెస్ లో రామేశ్వరరావు గారి లా ఎవ్వరైనా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా పాటిస్తే - గోపి(సన్నిధి స్వామి లా అవ్వచ్చు , మధు( ఆగమం స్వామి లా అవ్వచ్చు ) , భరత్ స్వామి దేవనాథ జీయర్ స్వామి లా అవ్వచ్చు, అహోబిల జీయర్ స్వామి లా అవ్వచ్చు... ఇంకా ఎంతో మంది వారి పరిచార గణం లా అవ్వచ్చు , వీరందరిని చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందం వేస్తుంటుంది , కృషుణుడి ని యశోదా , నందు ల వారు ఎలా జాగ్రత్తగా చూసారో , అనుక్షణం కంటి కి రెప్పలా వీరందరూ మన స్వాతి ముత్యాన్ని మన కోసం రక్షణ కవచం లా ... సేవిస్తూ వున్నారు, స్వామి వారిని చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో మనసుకి, వీరందరినీ చూస్తున్నా మనసుకి అంతే ఉత్సాహం వస్తుంది. నిజంగా ఎంతో అదృష్టం మాకు మా కుటుంబానికి , మమ్మల్ని కూడా ఆచార్య పరంపరలో స్వామివారు చేర్చు కున్నందుకు. ఎంతో అదృష్టం మనకి జీయర్ శతాబ్ది , రామానుజ సహస్రాబ్ది , స్వామి వారి షష్ట్యబ్ది అన్నీ చూడ గలుగు తున్నాము , స్వామీ వారి షష్ట్యబ్ది ని స్వయంగా సేవించలేక పోతున్నందుకు కొంచెం కాదు కాదు చాలా బాధ గానే వున్నది , US లో ఉండటం వలన. కానీ తప్పదు మరి సహస్రాభ్ది కి సేవ చెయ్యటం కోసం US వచ్చాము కాబట్టి బాధ లేదు , రోజు చైనా updates ఫాలో అవుతున్నాము , చాలా ఆనందం గా వుంది, కానీ ఇప్పటికి ఒక లక్ష మాత్రమే ప్రాజెక్ట్ కోసం ఇచ్చాము అదే ఎక్కువ బెంగగా వుంది , ఇండియా P . F డబ్బులు 6.71 lacks వచ్చాయి, రిటైర్మెంట్ బెనిఫిట్ దాచు కోవటానికి ఇంత కన్నా బెస్ట్ ప్రాజెక్ట్ ఏమి ఉంటుంది ఎంత అదృష్టం మా కుటుంబానికి ఆహా , స్వామివారికి అవి ఇక్కడ టెక్సాస్ లో అందించాలని ఎదురు చూస్తూ .... మొత్తం 40 lacks ఇవ్వాలని చిన్న ఆశ దాన్ని మన చిన్న జీయర్ స్వామి తప్పక తీర్చాలి అని ఆశిస్తూ..వారి శిష్యుడిలా ఉండాలి అని ప్రయత్నించే.. సురేంద్ర రామానుజదాస... CT , US , 08/10/2016.
జై శ్రీమన్నారాయణ ! ఆచార్య దివ్య తిరువడి గలే శరణం !పరమ హంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారికి తిరునక్షత్ర ( షష్ట్యబ్ది )శుభాకాంక్షలు.
Add your wishes
Your name and message will appear on the wishes wall. Please enter your phone number. Email is optional: add it if you would like a confirmation message. Your contact details are kept private, never shown publicly.
0 / 1500
Share the page with your family and friends.