Experience the Divine

Experience the Divine

‘Andamina Anubhavalu’

#2 Heart of Gold!

Jai Srimannarayana! Under the guidance of His Holiness Sri Chinna Jeeyar Swamiji, Sama:srayanam took place in the city of Amersham, UK, on June 23rd. Sama:srayanam, also known as Pancha Samska:ra, is a process where the Guru blesses the disciple with five qualifications to become a Sri Vaishnava and embark on a new journey of knowledge. Everyone is eligible to receive Sama:srayanam, regardless of caste, creed, and gender.

Life presents us with various hardships and pleasures, often leading us to wonder, “why did this only happen to us?”. Many times, we hear the phrase, “It’s my karma,” and indeed, this holds a hundred percent truth. Our experiences, both pleasant and challenging, are a result of the karmic records that have accumulated in us over time.

Imagine a life where these karmas are eradicated – how comfortable if would be! This secret was revealed by Sri Krushna in the Bhagavad Gita. When all our actions become akin to ya:ga, we no longer become attached to the outcomes of our deeds.

So, how do we perform our activities like ya:ga?
This requires disciplined practice in a systemic manner known as Pancha Samska:ra.
Pundra involves wearing thilak on the forehead. Tha:pa entails receiving imprints of slightly heated discus and conch from the Guru. Na:ma involves adding “Ramanuja Da:sa/Da:si” to one’s name. Manthra requires obtaining Ashta:kshari: manthra from the Guru and meditating on it daily. Finally, Ya:ga involves performing all actions with the intention that they are done for the sake of God.

These five qualifications are essential for the removal of karmas. Countless individuals endure immense suffering due to a lack of this knowledge, facing their own hell in this very life without the need for another.

The practice of Ashta:kshari; manthra meditation empowers us to control our minds and perform actions without attaching ourselves to the results of deed, thus preventing karmas from clinging to us.

During Sama:srayanam in the UK, two devoted volunteers of JET UK were eager to receive the Pancha Samska:ras. Unfortunately, due to unforeseen circumstances, they couldn’t undergo the process on the scheduled day. The pain of missing the opportunity and the sorrow of losing the golden chance left hem devastated.

Having learned of their plight, Swamiji made a compassionate decision to stay in town for two extra days despite His busy schedule. The joy of these devotees knew no bounds as Swamiji proceeded to perform the Sama:srayanam for them. Such ceremonies are not brief affairs, and even obtaining a mere five minutes in Swamiji’s Chock-a-block schedule seemed nearly impossible. However, Swamiji’s unwavering dedication and love for His disciples prevailed, ensuring they did not miss this sacred opportunity.

As part of the Tha:pa samska:ram, the heated discus and conch imprints were placed on the devotees’ shoulders, with ghee applied on them, which provides soothing relief. The melting ghee/butter reminded us of the heart of Acharya which melts with compassion looking at our sufferings. Swamiji’s willingness to take on any trouble so that His devotees do not experience sorrow is a testament to His golden heart.

Jai Srimannarayana!

#2 ఆచార్యుల మనసు వెన్న!

శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వారు జూన్ 23న యూకే లోని ఆమెర్షం అనే పట్టణంలో భక్తులకు సమాశ్రయనాలను అనుగ్రహించారు.
సమాశ్రయణం లేదా పంచ సంస్కారాలు అంటే, గురువు ఒక ఐదు సంస్కారాలను శిష్యులకు అనుగ్రహించి, వారికి జ్ఞాన జన్మ ప్రసాదించి, శ్రీ వైష్ణవులుగా తీర్చిదిద్దుతారు. కుల, వర్గ, లింగ బేధాలు లేకుండా, దీనికి అందరు అర్హులే.

మనం జీవితంలో ఎన్నో రకాల కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటాము. మనలో ప్రతి ఒక్కరం, జీవితంలో కనీసం ఒక్క సారైనా, “ఈ కష్టం మనకే ఎందుకు వచ్చింది” అని అనుకుంటూ ఉంటాం. “అంతా నా కర్మ” అని అనడం కూడా చాల సార్లు వింటూ ఉంటాం. ఇది వంద శాతం నిజం. మన కష్ట సుఖాలకు కారణం మనలో పొరలు పొరలుగా పేరుకుపోయి ఉన్న కర్మల సముదాయమే.

మరి ఈ కర్మలే తొలిగిపోతే జీవితం ఎంత హాయిగా ఉంటుంది కదా! శ్రీ కృష్ణుడు భగవద్ గీత లో ఈ రహాస్యాన్నే తెలియచేసాడు. మనం చేసే ప్రతి పని ఒక యాగం లాగ చేసినప్పుడు మనకు కర్మలు అంటుకోవు.

మరి కర్మలు యాగం లాగ చేయడం ఎలా?
దీనికి సాధన అవసరం, ఒక క్రమ పద్దతిలో క్రమశిక్షణతో చేసే సాధన. అదే పంచ సంస్కారం,,,. పుండ్ర, తాప, నామ, మంత్ర, యాగ అనే ఐదు సంస్కారాలు.
పుండ్ర – నుదుట తిలకం ధరించడం, తాప – కొద్దిగా వేడిగా ఉన్న శంఖు చక్రాల ముద్రలను ఆచార్యుల ద్వారా పొందడం. నామ – నామంలో రామానుజ దాసులం అని పేర్కొనడం, మంత్ర – అష్టాక్షరీ మంత్రాన్ని గురువు ద్వారా పొంది, ప్రతి రోజు ధ్యానించడం. యాగ – చేసే ప్రతి పనిని పరమాత్మ కోసమే చేస్తున్నాననే భావనతో చేయడం.

కర్మలు తొలగడానికి ఈ ఐదు అవసరం. కొన్ని కోట్ల మంది ఈ జ్ఞానం లభించక, అందమైన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. ఇక వేరే నరకం అవసరం లేకుండా!
అష్టాక్షరీ మంత్ర ధ్యానం వల్ల, మనస్సు మన అధీనం లో ఉండి, మనం చేసే పనిలో కర్తృత్వం లేకుండా, కర్మలు మనకు అంటుకోకుండా చేయగలిగే సామర్ధ్యాన్ని ఇస్తుంది.

శ్రీ స్వామి వారు సమాశ్రయనాలను యూకే లో నిర్వహించినప్పుడు, ఇద్దరు భక్తులు, వీరు జెట్ లో మంచి వాలంటీర్స్, ఎప్పటి నుంచో పంచ సంస్కారాలు పొందాలని ఉవిళ్లూరుతున్నారు. కానీ ఆ సమయం వచ్చే సరికి అవాంతర కారణాల వల్ల సమాశ్రయణం చేయించుకోలేకపోయారు. ఇక మళ్ళీ ఎప్పుడు ఈ అవకాశం వస్తుందో అనే బాధ, బంగారు అవకాశం చేజారిందే అనే దుఃఖం, ఇలా రాత్రిపగళ్ళు ఏడుస్తూనే ఉన్నారు.

ఇది తెలిసిన స్వామి వారు, ఆ రోజు ఆ పట్టణం నుండి బయలుదేరాల్సి ఉన్నప్పటికీ, ఎవ్వరు ఊహించని విధంగా, మేము వాళ్ళిద్దరికీ సమాశ్రయణం చేసే వెళ్తాము అని సెలవిచ్చారు. రెండు రోజులు అదనంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ భక్తుల ఆనందానికి అవధుల్లేవు. సమాశ్రయణం అంటే కొద్ది నిమిషాల్లో జరిగే పని కాదు. స్వామి వారి కిక్కిరిసిన కార్యక్రమాలలో 5 నిముషాలు కూడా వ్యవధి లేని పరిస్థితి. అయినా వారికీ సమాశ్రయనాలు చేసే అక్కడి నుండి బయలుదేరారు.

తాప సంస్కారంలో భాగంగా, భుజాలపై వేడి శంఖు చక్రాల ముద్రలు వేసినప్పుడు, చల్లదనానికై నేయి రాస్తారు, ఆ నేయి చర్మం పై కరగడంతో ఉపశమనాన్ని కలుగచేస్తుంది. అది చూస్తే ఆచార్యుల హృదయం కూడా ఆ నేయి/వెన్న లాంటిది కదా అని అనిపించింది. భక్తుల ఆర్తి స్వామి వారి హృదయాన్ని కరిగించింది. తమకు ఎంత ఇబ్బంది అయినా ఫరవాలేదు, ఆ భక్తులకు దుఃఖం కలగకూడను, వారు ఆనందంగా ఉండాలి అని కోరుకునే గొప్ప ఆచార్య హృదయం.

జై శ్రీమన్నారాయణ!