శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామీజీ మంగ‌ళాశాస‌నాల‌తో 8వ వార్షిక బ్రహ్మోత్స‌వాలు శంసాబాద్‌లోని దివ్య‌సాకేత క్షేత్రంలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభమ‌య్యాయి. శ్రీ అహోబిళ జీయ‌ర్ స్వామీజీ, శ్రీ దేవ‌నాథ జీయ‌ర్ స్వామీజీ ఉత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పెద్ద జీయ‌ర్ శ్రీ రామానుజుల వారిని స్మ‌రిస్తూ..కీర్తిస్తూ చిన‌జీయ‌ర్ స్వామీజీ స‌హ‌స్రాబ్ధి ఉత్స‌వ విశిష్ట‌త‌ను తెలియ చేసేలా పూజాది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. శ్రీ రామానుజుడు మూడు రూపాల్లో ఉన్నార‌ని దాని గూర్చి తెలియ చేశారు. ప‌ర‌మ‌ద నాథ‌, శ్రీ రంగ‌నాథ‌, శ్రీ రామ‌చంద్ర రూపాల్లో ఎనిమిదేళ్ల కింద‌ట ద‌ర్శ‌న‌మిచ్చార‌ని తెలిపారు. మే 5న ఉద‌యం ఈ బ్ర‌హ్మోత్స‌వ కార్య‌క్ర‌మం శ్రీ‌రాముడికి 21 క‌ల‌శాల‌తో అభిషేకం చేశారు స్వాముల వారు. సాయంత్రం స్వామి వారికి అంకురార్ప‌ణ‌తో పాటు శ్రీ విశ్వ‌కేశ పూజ‌, పుణ్య‌వ‌చనం నిర్వ‌హించారు. దీక్షా కంక‌ణాల‌ను భ‌క్తుల‌కు అంద‌జేశారు. పారాయ‌ణ ప‌ఠ‌న‌తో పాటు ఉభ‌య‌ధార‌ల‌కు ప‌సుపు ప‌చ్చ‌ని దుస్తుల‌ను అంద‌జేశారు. విశ్వ‌కేసుడు, భూదేవి, వ‌ర‌హ స్వామి తో మృత‌సంగ్రాహం చేప‌ట్టారు. అనంతరం యాగ‌శాల‌ను ద‌ర్శిస్తారు. అక్క‌డ ద్వారపూజ చేప‌డ‌తారు. 12 నుండి 14 ర‌కాల న‌వ ధాన్యాల‌తో పాటు స్వ‌చ్ఛ‌మైన ఆవు పాల‌తో పూజాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. దేవ‌త‌ల‌కు స‌మ‌ర్పిస్తారు. ఆల‌యంలో హోమం చేప‌డ‌తారు. ఆరు బీజాక్ష‌రాల‌తో హార‌తి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. గ‌రుడ ప‌టం మీదుగా శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామీజీ క‌ల‌శాల నిర్వ‌హ‌ణ చేప‌డ‌తారు. దీంతో ఉత్స‌వ కార్య‌క్ర‌మం మొద‌టి రోజు పూర్త‌వుతుంది. ఈ ఉత్స‌వాల‌లో వివిధ ప్రాంతాల నుంచి భారీగా త‌ర‌లి వ‌చ్చారు భ‌క్తులు. ప్ర‌ధాన ఆల‌యంలో చేప‌ట్టిన పూజా క‌ర్య‌క్ర‌మంలో రామానుజుల మూల‌మంత్రంతో పాటు జై శ్రీ‌మ‌న్నారాయ‌ణతో ద‌ద్ద‌రిల్లి పోయింది. ఈ సంద‌ర్భంగా స్వామీజీ వెయ్యేళ్ల ఉత్స‌వ కార్య‌క్ర‌మాల వివ‌రాల గూర్చి భ‌గ‌వత్ బంధువుల‌కు తెలియ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌తి ఒక్క‌రు విధిగా హాజ‌రు కావాల‌ని పిలుపునిచ్చారు. సంఘ సంస్క‌ర‌ణే ధ్యేయంగా త‌న జీవితాన్ని త్యాగం చేసిన మ‌హ‌నీయుడిని స్మ‌రించు కోవ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని గుర్తు చేశారు.