వెంక‌య్యను ఆశీర్వ‌దించిన చిన‌జీయ‌ర్ 

అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. శ్రీ శ్రీ భ‌గ‌వ‌త్ రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ధి జ‌యంతి ఉత్స‌వాలను దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భ‌క్తులు , అనుచ‌రులు నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను తెలియ చేస్తూ ప్ర‌పంచానికి చాటి చెప్పేందుకు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామీజీ దివ్య సాకేతం ఆశ్ర‌మంలో 216 అడుగుల రామానుజుల భారీ విగ్ర‌హాన్ని త్వ‌ర‌లో ప్ర‌తిష్టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రామానుజుల జీవితం , ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటూ దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఢిల్లీలో త‌న నివాసంలో త‌పాలా బిళ్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు , అధికారులతో పాటు చిన‌జీయ‌ర్ స్వామీజీ ప్ర‌త్యేకంగా పాల్గొన్నారు. పెద్ద‌ల‌కు స్వామి వారు మంగ‌ళాశాస‌నాలు అంద‌జేశారు. అనంత‌రం ఆధ్యాత్మిక గురువుగా వినుతి కెక్కిన చిన‌జీయ‌ర్ స్వామీజీని కేంద్ర మంత్రి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు త‌మ గృహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేర‌కు మంత్రి అభ్య‌ర్థ‌న‌ను స్వామీజీ మ‌న్నించి ఆశీస్సులు అంద‌జేశారు. చిన‌జీయ‌ర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు, సేవా ప‌నుల గురించి స్వామి వారు తెలియ చేశారు. చిన‌జీయ‌ర్ స్వామీజీ రాక‌తో వెంక‌య్య నాయుడు కుటుంబం సంతోషంలో మునిగి పోయింది.

Something rare happened. Sri Ramanujacharya’s Sahasrabdi celebrations are being celebrated across the world. Sri Sri Sri Chinna Jeeyar Swamiji is going to consecrate a 216 ft, tall vigraham of Ramanujacharya to propagate the message of EQUALITY taught by Sri Ramanujacharya. On this occasion, a commemorative stamp was released in New Delhi by PM Narendra Modi. HH Chinna Jeeyar Swamiji, Ministers, governments officials attended the program. Later,  HH Sri Chinna Jeeyar Swamiji went to Minister of Housing and Urban Poverty Sriman Venkaiah Naidu’s house on invitation and offered mangalasasanams.


Total Post Reads : 658


Related Posts
Divine and Remarkable Experience, says MP Ex CM Sri Shivaraj Singh Chouhan!

Overcome the Hurdles in your Life Journey

The Homeo Think Tank Meet

What does the Red and the White signify?

Archana, an offering in Devotion
avatar