#1 Acharya’s Grace – Power of Sri Vishnu Sahasra Na:mam

Jai Srimannarayana! With the blessings of His Holiness Sri Chinna Jeeyar Swamiji, a truly awe-inspiring and miraculous event unfolded during His visit to the United Kingdom in June.

The Jeeyar Educational Trust UK team, eagerly anticipating Swamiji’s arrival, had meticulously organized numerous special pooja and service programs for this 12-day event. However, amidst the preparations, an unexpected obstacle arose when news spread that not all Ruthwiks and Vedic Scholars were able to secure UK visa interviews. The team was deeply concerned, knowing the significant role these scholars played in the upcoming events and the disappointment it would bring to countless devotees.

In the face of uncertainty, the team held firm to their unshakable faith in Swamiji’s words, emphasizing the greatness and potency of the Sri Vishnu Sahasra Na:ma Stho:thram and how it could alleviate their miseries and act as a powerful remedy for any problem. With this faith in their hearts, the JET UK team decided to chant the Sri Vishnu Sahasra Na:ma Stho:thram eleven times, with complete trust in the divine grace of their Acharya.

In the days that followed, the power of their devotion became evident when they received the heartening news that every single Ruthwik had successfully obtained their visas! The team’s joy knew no bounds, and they marveled at the divine intervention that led to such a favorable outcome,

As planned Sri Swamiji, along with His entourage, graced the United Kingdom with His divine presence. All the programs, carried out magnificently, were a testament to the blessings of HH Swamiji.

This incident stands as a shining example of how absolute faith in the words of the Acharya and the unwavering practice of chanting the Sri Vishnu Sahasra Na:ma Stho:thram can bring about extraordinary results.

Jai Srimannarayana!

You too can send us your inspiring experiences with Acharya and the Divine. Remember, joy shared is joy doubled…

#1 ఆచార్య అనుగ్రహం – విష్ణు సహస్ర నామ బలం
జై శ్రీమన్నారాయణ!
శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వారు, ఈ మధ్య, జూన్ లో 12 రోజులు యునైటెడ్ కింగ్డమ్ పర్యటించి, తమ పాద ధూళితో ఆ నేలని పావనం చేసారు.

శ్రీ స్వామి వారు తమ ప్రవచనాల్లో తరచుగా, విష్ణు సహస్ర నామ స్తోత్రం యొక్క గొప్పదనాన్ని, అది ఏ విధంగా మన కష్టాలను తొలగించి, ఏ సమస్య కైనా ఎలా ఒక గొప్ప ఔషధంగా పని చేస్తుందో కొన్ని వేల సార్లు మనకు చెప్పి ఉంటారు. కానీ మనలో ఎంత మంది దానిని సంపూర్ణ విశ్వాసంతో ఆచరిస్తాం అనేది సందేహాత్మకమే…

జెట్ యూ.కే. టీం సభ్యులు యూ.కే. లో జరిగే ఈ 12 రోజుల కార్యక్రమం కోసం ఎన్నో విశేష పూజ కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని స్వామి వారు, వారి పరివారం యొక్క రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక వార్త… అందరు ఋత్వికులకు, వేద పండితులకు యూకే వీసా ఇంటర్వ్యూ దొరకలేదని, వారు రావడం కష్టమని….

ఒక్కసారిగా టీం అందరిలోనూ నిరాశ నిస్పృహ. ఎన్నో వేల మంది స్వామి వారి రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు, భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి, ఏమి చేయాలో తోచని పరిస్థితి.

కానీ జెట్ యూకే సభ్యులకి స్వామి వారి వాక్కు పైన సంపూర్ణ విశ్వాసం. “స్వామి వారు మనకు ఎప్పుడూ చెప్పినట్లుగా శ్రీ విష్ణు సహస్ర నామాన్ని 11 సార్లు పారాయణం చేద్దాం, ఆ తరువాత స్వామి వారి దయ”, అని విశ్వసించి, శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని 11 సార్లు పారాయణం చేశారు.
చేసిన 5 రోజుల్లోనే, “అందరికీ వీసాలు వచ్చాయి” అనే శుభ వార్త వచ్చింది.

ఇక వారి ఆనందానికి అవధుల్లేవు. అన్నీ అనుకున్నట్లుగా, శ్రీ స్వామి వారు తమ పరివారంతో యూకే విచ్చేసి, స్వామి వారి అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయి.

ఆచార్యుల అనుగ్రహం, విష్ణు సహస్ర నామ బలంతో మనం ఏదైనా సాధించవచ్చు అనే దానికి, ఈ సంఘటన ఒక చిన్న ఉదాహరణ!

జై శ్రీమన్నారాయణ!

ఇతరులకు స్ఫూర్తి కలిగించే మీ అనుభవాలను కూడా మాకు పంపించండి. అందరితో కలిసి పంచుకుందాం! ఉజ్జీవిద్దాం!