అందమైన అనుభవాలు

ఆక్స్‌ఫర్డ్ మేధావులకు కూడా అంతు పట్టని రహస్యం,
నుదుటి తిలకంలో……

గత జూన్ లో, ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయంలో శాంతి గురించి జరిగిన ఒక సదస్సులో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు ప్రధాన వక్త. సదస్సు యొక్క ముఖ్య విషయం “శాంతి అంటే ఏమిటి?”. అన్ని మతాలు శాంతి గురించి ప్రతిపాదించాయి, కానీ శాంతి యొక్క అసలైన అర్థం సరిగ్గా నిర్వచించబడిందా? దాని పరిధి ఎంత వరకు నిర్దేశింపబడినది? దేశం వరకా, సమాజం వరకా లేదా వ్యక్తుల వరకు మాత్రమేనా? అలాగే, వివిధ దేశాల మధ్య యుద్దాలు, మతోన్మాదం, వర్గాల మధ్య పోర్లు, ఇలా ఎక్కడ చూసినా తీవ్ర అశాంతి, వీటికి పరిష్కారం ఏమిటి?

యూకేలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన పలు విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని, పైన పేర్కొన్న అంశాలపై లోతైన చర్చలు జరిపారు.

సదస్సు రెండు భాగాలుగా విభజింపబడింది. ఉదయం సెషన్, మధ్యాహ్నం సెషన్, మధ్యలో లంచ్ బ్రేక్.

ఉదయం సెషన్ పూర్తి అయింది. అన్ని మతాల్లోనూ శాంతి గురించి ప్రస్తావించబడింది. కానీ దాని గురించిన అవగాహన అందరిలోనూ లేదు. వ్యక్తులతో పాటు, ప్రభుత్వాలను చైతన్యవంతం చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో సరైన చట్టాలు అమలులోకి రావాలి. కానీ ఇవి ఎలా సాధ్యమవుతాయి? ఇది ఉదయం సెషన్ యొక్క సారాంశం

ఇక ఒక గంట లంచ్ బ్రేక్. అందరు భోజనశాల వైపు బయలుదేరారు. ఆక్స్‌ఫర్డ్ లైబ్రరీ ఆ పక్క బిల్డింగులో ఉంది. శ్రీ స్వామి వారితో పాటు, కొంత మంది లైబ్రరీ చూద్దామని బయలుదేరారు. పక్క బిల్డింగుకు వెళ్లాలంటే మెయిన్ గేట్ దాటి వెళ్ళాలి.

ఆ మార్గంలో వెళ్లే ఒక వ్యక్తి (పై చిత్రంలోని వ్యక్తి), శ్రీ స్వామి వారిని చూసి ఆగి, గ్రీట్ చేసాడు. తర్వాత, కుతూహలంగా, “సర్, మీ నుదుటి పైన ఉన్న ఆ మార్క్ ఏమిటి” అని అడిగాడు ఆంగ్లంలో. శ్రీ స్వామి వారు ఓపిగ్గా అదేంటో వివరించారు.

ముఖం మన మనస్సులో కలిగే భావాలకు ప్రతీక. మనలో ప్రతి ఒక్కరం, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని, మనల్ని అందరు ప్రేమించాలని, మనస్సు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాము.
ఈ మార్కులో క్రింద ఆధారంగా ఉన్న తెలుపు గుర్తు శాంతికి చిహ్నం. పొడవుగా ఉన్న ఎరుపు రేఖ ప్రేమకు చిహ్నం. పరస్పర ప్రేమ ఉండాలంటే, దానికి మూలం శాంతి. అందుకే శాంతి పునాదిగా, తెలుపు రంగు అడుగున ఉంది. వ్యక్తులలో శాంతి భావం స్థిరంగా ఉన్నప్పుడు, ప్రేమ స్వభావం పెరుగుతుంది. ఈ నిలువు రేఖ ఆ పెరుగుదలను సూచిస్తుంది. మన సహజ స్వభావం ప్రేమ అయినప్పుడు, ఇతర జీవులను సహజంగానే ఆదరిస్తాము, శాంతితో సహజీవనం చేయగలుగుతాము. ఇదే ఆనందానికి సూత్రం అని వివరించారు.

ఆ వ్యక్తి స్వామి వారికి కృతజ్ఞతలు తెలిపి, నేను ఏ మతాన్ని నమ్మను, కానీ ఇది బావుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ క్షణంలో జ్ఞానోదయం కలిగింది. ఉదయం మూడు గంటల పాటు జరిగిన చర్చకు పరిష్కారం ఎక్కడో లేదు, ఆ రహస్యం మన నుదుటి తిలకంలోనే దాగి ఉంది.

మన ఋషులు, పూర్వాచార్యులు ఇలాంటి జ్ఞానాన్ని మాటల్లోనే కాదు ఎలా ఆచరించాలో మనకు చూపించారు. శాంతి మన మనస్సులోనే కాదు, మన ప్రతి కణంలోను ఉండేలా ఊర్థ్వ పుండ్రాన్ని ప్రసాదించారు. ఊర్ధ్వ పుండ్రం (తిలకం) ధరించడం వల్ల, మనం ఆ భావాన్ని మనలో నిలుపోగలుగుతున్నాము. ప్రేమ, శాంతి, ఆనందాలను మనలో మనం అనుభవించగలుగుతూ, మన చుట్టూ కూడా ప్రసరింపచేయగలుగుతున్నాము.

ఈ కాలంలో చాల మంది తిలకం ధరించడం నామోషీగా భావిస్తుంటారు. కానీ దాని వెనుక దాగి ఉన్న నిగూఢ అర్ధాన్ని తెలుసుకోగలిగితే, మనం ఊర్థ్వపుండ్రాన్ని సగర్వంగా ధరించగలుగుతాము. మన పిల్లలకు కూడా దాని విశేషతను తెలుపగలుగుతాము.

ఇలా వ్యక్తుల్లో కలిగిన పరివర్తన, శాంతి పరిమళాలను సమాజం, దేశం, చివరికి ప్రమంచమంతా వెదజల్లేలా చేస్తుంది.

శాంతి కోసం ఉద్యమాలు చేయనవసరం లేదు. మన గొప్ప వైదిక సంప్రదాయాన్ని మనం ఆచరించగలిగితే చాలు. మనం శాంతి దూతలు అవుతాం. ఇతరులకు శాంతి మార్గాన్ని చూపగలిగిన వాళ్లమవుతాము.

జై శ్రీమన్నారాయణ!

  • అందమైన అనుభవాలు అందమైన అనుభవాలు జై శ్రీమన్నారాయణ! ఆధ్యాత్మిక పయనంలో అమెరికాలో నివసిస్తున్న ఒక భక్తుడి అనుభవాలు... ***** భాగవతులకు దాసోహాలు! చాలా సంవత్సరాల క్రితం, శ్రీ చిన్న

    Share This Story,
  • అందమైన అనుభవాలు అందమైన అనుభవాలు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు యూకే పర్యటనలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి, నా మనస్సును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి

    Share This Story,
  • అందమైన అనుభవాలు అందమైన అనుభవాలు బదరీ నారాయణ పెరుమాళ్ తిరునక్షత్ర శుభాకాంక్షలు! గత జూన్‌లో, నేను, మా అమ్మాయి అమెరికా నుండి భారతదేశానికి వస్తున్నాము. మా ప్రయాణంలో

    Share This Story,
  • అందమైన అనుభవాలు ఆచార్య రహస్యం జై శ్రీమన్నారాయణ!మనం ఎప్పుడైనా గాఢంగా ఆలోచిస్తున్నప్పుడు లేదా ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన, ఇది వరకు ఎప్పుడు తట్టని ఒక

    Share This Story,
  • శ్రీమతి పద్మ రాళ్లపల్లి గారు, ఇంగ్లీష్ లెక్చరర్, విశాఖపట్నం నుండి. ఇది తెలుగు అనువాదం. నా చిన్న తనంలో, మా అమ్మమ్మ నన్ను విజయవాడకు సమీపంలో ఉన్న ఒక గురువుల

    Share This Story,